ప్రస్తుతం ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' సినిమాలో నటిస్తున్నాడు.  కరోనా కారణంగా లేటైనా ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా ఇటలీలో మళ్లీ మొదలైంది. ఇటలీ దేశంలో కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. అయినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్ర షూటింగ్ కొనసాగిస్తున్నారు. తాజాగా అక్కడి మీడియా ప్రభాస్.. రాధే శ్యామ్ షూటింగ్ పై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.