సంక్రాంతి టార్గెట్ గా విడుదలవుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాకోసం హీరో అఖిల్ పెద్ద సాహసమే చేయబోతున్నారని తెలుస్తోంది. సినిమా రిలీజ్ రోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన టూర్ ప్లాన్ చేసుకుంటున్నారట. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా.. జనాల్లోకి వెళ్లాలని అఖిల్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అఖిల్ సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తే.. లాక్ డౌన్ తర్వాత ధైర్యంగా జనాల్లోకి వెళ్లిన తొలి హీరోగా రికార్డ్ సృష్టించడం మాత్రం ఖాయం.