అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ పుష్పపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లోనే జరుగుతుంది. బన్నీ లారీ డ్రైవర్ గా మొరటు పాత్రలో కనిపించబోతున్నాడు. మాసిన దుస్తులు.. గుబురు గడ్డం.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఉన్న బన్నీ ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. పుష్ప రాజ్ కి తగ్గట్టే రష్మిక పాత్ర కూడా ఉండబోతోందని తెలుస్తోంది. గిరిజన యువతిగా కనిపించడంతో పాటు చిత్తూరు యాసలో మాట్లాడే ఈ పాత్రకి రష్మిక నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తుందని అంటున్నాడు దర్శకుడు సుకుమార్.