బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన హీరోయిన్ అమీషా పటేల్ కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. లోక్ జన శక్తి పార్టీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర కోసం అమీషా పటేల్ ప్రచారం చేయడానికి ఆయన నియోజకవర్గానికి వెళ్లారట. ఈ క్రమంలో ఏకంగా అబ్యర్థి ప్రకాష్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని అమీషా అంటున్నట్టుగా ఉన్న ఓ ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్ ప్రచారంలో ఎవరు ఎప్పుడు, ఎటువైపునుంచి దూసుకొస్తారో తెలియలేదని, ఎవరు ఎక్కడ టచ్ చేస్తారో అని భయపడిపోయానని అమీషా అన్నట్టు ఆ ఆడియో టేప్ లో ఉంది.