ప్రస్తుతం అందరి చూపు ‘ధూమ్4’ పైనే ఉంది. మొదట సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్టులో నటిస్తాడని జోరుగా ప్రచారం జరిగింది.కానీ కారణాలేంటో తెలీదు కానీ..ఆయన ఈ ప్రాజెక్టు పై అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇప్పుడు ‘ధూమ్4’ ను కచ్చితంగా రిచ్ గా తెరకెక్కించాల్సి ఉంది. ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ వారు కూడా 600కోట్ల వరకూ బడ్జెట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే బాలీవుడ్ ను మాత్రమే నమ్ముకుని అంత పెద్ద మొత్తం పెట్టడమనేది కరెక్ట్ కాదు. కచ్చితంగా ఆ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలి. అందుకే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ అయితేనే.. ఈ భారీ ప్రాజెక్టుకి కరెక్ట్ అని వారు భావిస్తున్నారట. నిజానికి ‘బాహుబలి'(సిరీస్) తరువాత వచ్చిన ‘సాహో’ పెద్ద హిట్టయితే కాదు.