ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో ఈ నెల 30న ముంబైలో తన వివాహం జరగబోతున్నట్లు కాజల్ అధికారికంగా ఓ ప్రకటనలో వెల్లడించింది. తాజాగా మెహందీ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాజల్ గురువారం తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.