లాక్ డౌన్ టైమ్ కి రామ్ 'రెడ్' మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే థియేటర్లు లేకపోవడంతో దీన్ని బైటకు వదలలేకపోయారు. మరోవైపు ఓటీటీ ప్లాట్ ఫామ్ లనుుంచి రెడ్ మూవీపై విపరీతమైన ఒత్తిడి వచ్చింది. ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేసి మరీ ఈ సినిమా తీసుకోవాలని చూశారు. కానీ రామ్ మాత్రం ఇస్మార్ట్ శంకర్ హిట్ మేనియాలోనే ఉన్నారు. థియేటర్లలోనే తన సత్తాచూపిస్తానంటూ ఓటీటీ ఆఫర్లకు నో చెప్పారు. సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా పూర్తికావడంతో రామ్ మాటకు ఎదురు లేకుండా పోయింది.