గోవా రాష్ట్రంలోని ఒక గ్రామంలో షూటింగ్ ముగించగా.. చిత్రీకరణ చేసే సమయంలో గ్రామంను చెత్తమయంగా చేసినందుకు గాను కరణ్ జోహార్, ధర్మ ప్రొడక్షన్స్ పై ఫిర్యాదు నమోదు అయ్యింది. ఇది ఖచ్చితంగా వారు చేసిన పనే అంటూ ఆరోపణలు చేశారు. ఆ గ్రామంలోని స్థానికులు కొందరు సోషల్ మీడియా ద్వారా గ్రామంలో ధర్మ ప్రొడక్షన్స్ వారు వదిలి వెళ్లిన చెత్తను ఫొటోలు మరియు వీడియోలు తీసి షేర్ చేశారు.