సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమాని ఒప్పుకున్నట్టు సమాచారం. యాక్షన్ కింగ్ అనే పేరున్న అర్జున్.. ఇటీవల కొంతకాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. లాక్ డౌన్ టైమ్ లో నాగచైతన్యకు అర్జున్ ఓ స్టోరీ వినిపించారని, ఇది ఆయనకు బాగా నచ్చిందని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ తర్వాత, విక్రమ్ కుమార్ తో చేస్తున్న థ్యాంక్యూ సినిమా సెట్స్ పైకి వెళ్తారు చైతన్య. ఆ రెండూ పూర్తయిన తర్వాత అర్జున్ దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ చేస్తారు.