ఇటీవల దసరా పండగ సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మలయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్లు వెల్లడించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే ఈ సినిమాలో మరో హీరోకు కూడా అధిక ప్రాధాన్యత ఉండగా.. ఆ కథానాయకుడు ఎవరు? అనే విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.ముందుగా ఈ పాత్ర రానా చేస్తాడని వార్తలు వచ్చినా, తాజాగా మరో హీరో పేరు తెరమీదకొచ్చింది. పవర్ స్టార్ డైహార్డ్ ఫ్యాన్ నితిన్ ఈ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.హీరో, ఫ్యాన్ కలిసి సరికొత్త కాంబినేషన్‌తో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు.  ఇక ఈ సినిమాలో పవన్ వైఫ్‌గా ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించనుందనే న్యూస్ కూడా ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.