ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ టీజర్ విడుదలైన తర్వాత ఎక్కడ విన్నా ఆర్ఆర్ఆర్, ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్. అవును.. భీమ్ ఫర్ రామరాజు అంటూ అప్పట్లో రామ్ చరణ్ టీజర్ విడుదల తర్వాత అందరూ ఆ టీజర్ మేకింగ్ గురించి మాట్లాడుకున్నారు. సినిమా అదిరిపోతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు రామరాజు ఫర్ భీమ్ టీజర్ తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీజర్ లో రామ్ చరణ్ వాయిస్ వీక్ గా ఉందని అనుకున్నా.. తర్వాత తర్వాత ఆర్ఆర్ఆర్ సినమాపై అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోతోంది.