ఈ వారం కూడా బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలు సమంతకు అప్పగించాలని నాగార్జున అనుకున్నారట. ఐతే సమంత దీనికి ఒప్పుకోలేదని సమాచారం. సమంతకు తెలుగు ఇబ్బందిగా మారడంతో పాటు షోని హోస్ట్ చేయాలంటే...వారం పూర్తిగా అన్ని ఎపిసోడ్స్ చూడాలి.హౌస్ మేట్స్ తప్పొప్పులు గుర్తించి, వారితో చర్చించాల్సి ఉంటుంది. ఎప్పుడూ బిజీ షెడ్యూల్ కలిగి ఉండే సమంతకు ఇది ఇబ్బందిగా మారిందట. అందుకే సమంత బిగ్ బాస్ హోస్టింగ్ చేయనని అన్నారట.సమంత నిర్ణయంతో ఒత్తిడిలోకి వెళ్లిన నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారట. షూటింగ్ పని వేళలు పెంచి వేశారట. సాధారణంగా రోజుకు 8 గంటలు షూట్ లో పాల్గొనే నాగార్జున 12 గంటలు పని చేయాలని నిర్ణయించుకున్నారట. వీలైనంత త్వరగా వైల్డ్ డాగ్ కులు మనాలి షెడ్యూల్ పూర్తి చేసి హైదరాబాద్ లో దిగిపోవాలని ఆలోచన చేస్తున్నాడట.