బాలయ్య షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో.. మరో సీనియర్ హీరో చిరు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సినిమా షూటింగ్ ల విషయంలో ఆతృతగా కనిపించే చిరు ఇప్పటికీ రంగంలోకి దిగకపోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే మరో రెండు, మూడు రోజుల్లో ‘ఆచార్య’ షూటింగ్ కూడా మొదలవుతుందని.. ముందుగా చిరంజీవి లేని సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. నవంబర్ మొదటి వారంలో చిరు సెట్స్ పైకి వస్తారని చెబుతున్నారు. ఇక చిరంజీవి వరుసగా సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసింది...