ప్రస్తుతం అందరు హీరోలు సినిమా షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉంటున్న నేపథ్యంలో సూపర్ స్టార్ కూడా తన తాజా చిత్రం సర్కారు వారి పాట షూటింగ్ మొదలు పెట్టారు. మహేష్ సెట్లో ఉన్నప్పుడు తీసిన ఫోటోని నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..లైట్స్, కెమెరా, యాక్షన్ ఈ మూడు పదాలు సినిమా స్టార్స్‌కి మ్యాజిక్ క్రియేట్ చేస్తాయని పేర్కొంది. ఇక ఇదిలా ఉంటె ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు చిత్ర బృందం. దీనికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమా ఓ సోషల్ మెసేజ్‌తో వస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది.