ఈ మధ్య త్రివిక్రమ్.. ఎన్.టి.ఆర్ కంటే ముందు మహేష్ బాబు తో సినిమా చేస్తాడని చెప్పుకుంటున్నారు.అలాగే యంగ్ హీరో రామ్ తో కూడా సినిమా చేసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. అయితే అనుకోకుండా ఇప్పుడు మహేష్ చేయబోతున్న సర్కారువారి పాట సినిమా కూడా ఆలస్యం అయింది. డిసెంబర్ లేదా జనవరి నుంచి సర్కారు వారి పాట మొదలవనుందని సమాచారం. సర్కారు వారి పాట మొదలు పెట్టి నాన్ స్టాప్ గా సినిమాని పూర్తి చేయాలని మహేష్ నిర్ణయించుకున్నాడట. కాబట్టి అందరూ అనుకుంటున్నట్టు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో అనుకున్న ప్రాజెక్ట్ మొదలవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అర్థమవుతోంది. దీన్ని బట్టి చూస్తే త్రివిక్రమ్, ఎన్.టి.ఆర్ సినిమానే ముందు పట్టాలెక్కనుంది. లేదంటే త్రివిక్రమ్, రామ్ తో సినిమా మొదలు పెట్టడానికి ప్లాన్ చేసుకుంటాడని అంటున్నారు.