రష్మిక టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటూ రోజురోజుకి తన స్టేటస్ ని పెంచుకుంటోంది. మరోపక్క కోలీవుడ్ లో కూడా సినిమాలు సైన్ చేస్తోంది. ఈ క్రమంలో హీరో నాగశౌర్య ఓ సినిమా కోసం రష్మికను సంప్రదిస్తే ఆమె నో చెప్పిందని సమాచారం.