వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ హిమాలయాల్లో పర్వతాల్లో కూడా ప్లాన్ చేశారు. అయితే, ఇక్కడ మంచు ఎక్కువగా ఉండటం వల్ల షూటింగ్ ఆలస్యం అవుతోందని మరో రెండు మూడు వారాలు షూటింగ్ ని పొడిగించే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. అందుకే, అనుకున్న దానికంటే రెండు మూడు వారాల తర్వాతే బిగ్ బాస్ టీమ్ తో నాగార్జున జాయిన్ అవుతాడని అంటున్నారు. అంటే గ్రాండ్ ఫినాలేకంటే ముందు నాగ్ బిగ్ బాస్ టీమ్ తో జాయిన్ అవుతాడు అన్నమాట.