తాజాగా సిద్ధార్థ్ చాలా ఏళ్ళ తర్వాత తెలుగులో నటిస్తున్నానంటూ తెలుపుతూ ఓ ట్వీట్ చేశాడు. ''8 సంవత్సరాల తరువాత నా మొదటి తెలుగు చిత్రం 'మహాసముద్రం' పనులు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. నేను చెప్పినట్లుగానే, అనుకున్నట్లుగానే తిరిగి మీకోసం వస్తున్నాను. ప్రస్తుతం నేను ఒక గ్రేట్ టీమ్ - గ్రేట్ కో యాక్టర్స్ తో వర్క్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీ విషెస్ నాకు కావాలి'' అని సిద్ధార్థ్ పేర్కొన్నాడు.