గతంలో సుధీర్ బాబుతో భలే మంచి రోజు సినిమా నిర్మించిన 70ఎం.ఎం. ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ శ్రీదేవి సోడా సెంటర్ అనే మరో సినిమాని సుధీర్ బాబుతోనే నిర్మిస్తోంది. పలాస సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన కరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా ఈ ముగ్గురినీ కలిపే బాధ్యత మహేష్ బాబు తీసుకున్నారట. మహేష్ చొరవ వల్లే సుధీర్ బాబుకి ఈ సినిమా సెట్ అయిందని అంటున్నారు.