క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాలను హీరోగా వెండితెరకు పరిచయం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త దర్శకుడు విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నట్టు సమాచారం.