ఎంగేజ్ మెంట్ రింగ్ ఫొటోలు పెట్టి రెండు రోజుల క్రితం నెటిజన్లను ఆటపట్టించింది పునర్నవి. ‘ఎట్టకేలకు ఇది జరుగుతోంది’ అని అంటూ ఎంగేజ్ మెంట్ రింగ్ ఫొటోకి క్యాప్షన్ కూడా పెట్టేసింది. దీంతో చాలామంది అభిమానులు నిజంగానే పున్ను ఎంగేజ్ మెంట్ జరిగిపోయిందని అనుకున్నారు. బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ ని కాకుండా.. మరొకర్ని ఆమె వివాహం చేసుకుంటోందని నమ్మేశారు. చాలామంది పున్నుకి శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే ఇదంతా డ్రామా అని తేల్చేసింది పునర్నవి.