అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ నవంబర్ 6నుంచి మొదలు కాబోతోంది. ఏకంగా నెలరోజుల భారీ షెడ్యూల్ ఇది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. గతంలో చిత్తూరు అడవులన్నారు, ఆ తర్వాత విశాఖ అటవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తారన్నారు. తీరా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని సెట్ చేసింది చిత్ర యూనిట్. మారేడు మిల్లి అటవీ ప్రాంతం సూపర్ గా ఉంటుంది. అందమైన పర్యాటక ప్రాంతం ఇది. ఇక్కడ షూటింగ్ అంటే నటీనటులకు పండగే. అందుకే ఇక్కడ షూటింగ్ సెట్ చేశారు సుకుమార్.