తాజాగా కాజల్ అగర్వాల్ పెళ్లి గౌతమ్ కిచ్లుతో శుక్రవారం రాత్రి ముంబైలో కన్నుల పండువగా జరిగింది. వధూవరుల మొట్టమొదటి పెళ్లి ఫొటో బయటికొచ్చింది. రోజ్ పింక్, ఎరుపు మిశ్రమ వర్ణం లెహెంగాలో కాజల్ గార్జియస్గా మెరిసిపోతోంది. ముక్కుకు పెద్ద రింగు, మెడలో హెవీ నెక్లెస్, పాపిడి బిళ్ల, నడుముకు వడ్డాణంతో సంప్రదాయ బద్ధమైన వధువు వేషధారణతో ఆకట్టుకుంది. ఇక గౌతమ్ తెల్లడి షేర్వాణీ, తలకు టర్బన్ ధరించి హుందాగా అవుపిస్తున్నాడు.  ముంబైలోని కొలాబాలో ఉన్న ద తాజ్ మహల్ హోటల్లో వారి వివాహ వేడుక జరిగింది. పెళ్లి వేదికను గులాబీలు, ఆర్చిడ్లు, రకరకాల పూలతో అలంకరించారు.