దసరా పండగ సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మలయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్లు వెల్లడించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు.ఇక ఈ రీమేక్ లో పవన్‌తోపాటు రానా నటిస్తాడని వార్తలు వచ్చినా..ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం అయ్యింది.  ఇక ఇప్పుడు నితిన్ పవన్‌తో ఈ రీమేక్ లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అన్న వార్త అభిమానులకు కిక్ ఇస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్‌తో జోడీ కట్టేది ఎవరు అనేది చర్చనీయాంశం అయింది. తెలుగు అమ్మాయి అంజలి పవన్ భార్యగా నటించబోతుంది అని ఫిల్మ్‌నగర్ టాక్. అరకు ఫారెస్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్లో సినిమా రాబోతుండగా.. సాగర్.కే.చంద్ర డైరెక్ట్ చేయబోతున్నారు.