మహేష్  సర్కారు వారి పాట  సినిమా షూటింగ్ 2021 జనవరి ఫస్ట్ వీక్ నుంచి జరగనున్నది. అత్యధిక అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ నిజానికి ఈ ఏడాది వేసవిలోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి దెబ్బకు రెగ్యులర్ షూటింగ్ అనివార్యంగా వాయిదా పడింది. ఇప్పుడు నిర్మాతలు జనవరి నుంచి షూటింగ్ జరిపేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.సినిమా కథలో చాలా భాగం అమెరికా నేపథ్యంలో నడుస్తుంది కాబట్టి ఎక్కువ శాతం షూటింగ్ అక్కడ జరపనున్నారు. యూనిట్‌కు సంబంధించిన వీసాల అనుమతుల కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అవి రాగానే యు.ఎస్.కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్లోనే మహేశ్, హీరోయిన్ కీర్తి సురేశ్ మధ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో మహేశ్ రెండు ఛాయలున్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం.