గతంలో ‘జైహింద్’ సినిమాతో పాటు తాను హీరోగా తెరకెక్కిన కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు అర్జున్. చాలా వరకు పోలీస్, దేశభక్తి నేపథ్యంలోనే సినిమాలు తీశాడు. ఇప్పుడు హీరోగా అవకాశాలు తగ్గిన తరువాత దర్శకుడిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ కథను సిద్ధం చేసుకున్నాడట అర్జున్. ఈ కథను చైతుకి వినిపించినట్లు తెలుస్తోంది. చైతూకి కూడా యాక్షన్ సినిమాలంటే ఆసక్తి. కెరీర్ ఆరంభం నుండి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ వర్కవుట్ అవ్వడం లేదు.