ప్రభాస్, రాజమౌళి మధ్య మంచి స్నేహం ఉంది. కేవలం బాహుబలి మాత్రమే కాదు.. వీరిద్దరి మధ్య అంతకు మించి మంచి స్నేహం కుదిరింది. ఒకరకంగా బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అన్నట్టుగా ప్రభాస్ కెరీర్ మారిపోవడానికి కారణం జక్కన్న మాత్రమే. తనకి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చిన రాజమౌళికోసం ఏం చేయడానికైనా సిద్ధమేనంటారు ప్రభాస్. అందుకే ఇప్పుడు బీజేపీకి, రాజమౌళికి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తున్నారు ప్రభాస్.