ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో'సర్కారు వారి పాట'సినిమాలో నటిస్తున్నాడు మహేష్ బాబు .సినిమా కథలో చాలా భాగం అమెరికా నేపథ్యంలో నడుస్తుంది కాబట్టి ఎక్కువ శాతం షూటింగ్ అక్కడ జరపనున్నారు.కానీ, వీసా సమస్యల వలన కుదరలేదు. ఇప్పుడు ప్లాన్ మారిందని సమాచారం. వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో చిత్రీకరణ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఏకధాటిగా 45 రోజుల షెడ్యూల్ చేయడానికి ప్లాన్ చేశారు. సినిమా షెడ్యూల్ ప్లానింగ్‌తో పాటు మహేశ్ పర్సనల్ ప్లానింగ్ కూడా మారినట్టు తెలుస్తోంది. సినిమా యూనిట్ కంటే ముందుగా కుటుంబంతో కలిసి ఆయన అమెరికా వెళ్లనున్నారట.  క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే ప్లాన్ చేశారట. తన ఫ్యామిలీ తో న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకొని.. ఆ తర్వాత షూటింగ్ లో జాయిన్ అవుతాడట మహేష్.