పవర్ స్టార్ వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తుండటంతో ఆయన తదుపరి సినిమాలపై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.ఇప్పటికే పవన్ కల్యాణ్ డైరెక్టర్ క్రిష్.. హరీష్ శంకర్.. సురేందర్ రెడ్డితో సినిమాలను లైన్లో పెట్టారు. తాజాగా మలయాళంలో సూపర్ హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' తెలుగు రీమేక్ లో పవన్ నటించిందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అయ్యప్పనుమ్ కోశియుమ్' మూవీకి సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా కోసం నిర్మాతలు పవన్ కల్యాణ్ కు భారీ ప్యాకేజీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం 40రోజుల కాల్షీట్ల కోసం 30కోట్లు చెల్లించడంతోపాటు సినిమా లాభాల్లో 25శాతం వాటా ఇవ్వనున్నారట. దీంతో 'వకీల్ సాబ్' పూర్తయిన వెంటనే 'అయ్యప్పనుమ్ కోశియుమ్' పట్టాలెక్కనుందనే టాక్ విన్పిస్తోంది.