యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించనున్నారు. ఇక మిగిలిన పాత్రాధారులకు సంబంధించిన ఎంపిక ప్రస్తుతం జరుగుతోంది. అయితే ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో కీలక పాత్రలైన సీత, హనుమంతుడు, లక్ష్మణుడు పాత్రలలో ఎవరు నటిస్తారన్న చర్చ జరుగుతూ వస్తోంది.ఇక సీత పాత్రకు గానూ పలువురి పేర్లు వినిపించాయి. అనుష్క శర్మ, అనుష్క శెట్టి, ఊర్వతి రౌటెలా, కియారా అద్వానీ, శ్రద్ద కపూర్ ఇలా పలు హీరోయిన్ల పేర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్రకు గానూ శ్రద్ద, కియారాలలో ఎవరో ఒకరిని తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ప్రభాస్ సాహోలో శ్రద్దా ఆడిపాడింది. సినిమా ఫ్లాప్ అయినా అందులో వీరిద్దరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఒకవేళ శ్రద్దకు ఈ అవకాశం వస్తే రెండోసారి ఈ జోడీని తెరపై చూడొచ్చు.ఇక కియారాను ఫైనల్ చేస్తే మొదటి సారి ఈ పెయిర్ కలిసి నటించనుంది.