ఫాతిమా మాట్లాడుతూ.. “చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టినప్పటికీ… హీరోయిన్ అవకాశాలు దక్కించుకోవడానికి చాలా కష్టాలు పడ్డాను. అవకాశాల కోసం ఎక్కడికిళ్ళినా అవమానాలు ఎదురయ్యేవి. కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సులు ఇస్తామని చెప్పేవారు. ‘ఉద్యోగం కోసం క్వాలిఫికేషన్ ఎలానో హీరోయిన్ కావాలంటే కమిట్మెంట్ అలా’ అని చాలా మంది అసభ్యకరంగా మాట్లాడేవారు.ఇక లైంగిక వేధింపులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. మహిళలకి ప్రతీ చోటా ఆ పరిస్థితి ఎదురవుతూనే ఉంది. నాకు మూడేళ్ళ వయసున్నప్పుడే లైంగిక వేదింపులు ఎదురయ్యాయి. నిజానికి ఇలాంటివి మహిళలు చెప్పుకోలేరు. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మారింది.మహిళలు కూడా చదువుకోవడం వల్ల లైంగిక వేదింపుల గురించి అందరికీ ఒక అవగాహన వచ్చింది. అందుకే ఇప్పుడు అంతా ఓపెన్ గా చెబుతున్నారు” అంటూ ఫాతిమా తన ఆవేదన వ్యక్తం చేసింది.