బిగ్ బాస్ 4 ఈవారం ఎలిమినేషన్ అనేది లేదని పక్కా ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. నిజానికి లాస్ట్ వీక్ సమంత వచ్చినపుడు దసరా కాబట్టి ఎలిమినేషన్ జరగదని అనుకున్నారు. అంతేకాదు, గత సీజన్ లో కూడా రమ్యకృష్ణ హోస్ట్ చేసిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్ అనేది జరగలేదు. అందుకే చాలామంది సమంత వచ్చినపుడు ఎలిమినేషన్ ఉండదనే అనుకున్నారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా 8వ వారం ఎలిమినేషన్ ని లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో నామినేషన్స్ లో ఉన్న హౌస్ మేట్స్ ఊపిరి పీల్చుకున్నట్లు అయ్యింది.