ఆవేశంతో ఊగిపోయినా కూడా తర్వాత నావల్ల నువ్వు హర్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా సారీ అంటూ మోకరిల్లి మరీ సారీ చెప్పాడు అవినాష్. అయినా కూడా నోయల్ కనికరించలేదు. ఇక్కడ ఇద్దరిలో తప్పెవరిది అని అంటే, నోయల్ అడగడం తప్పు కాదు.. కానీ అడిగిన విధానం తప్పుగా ఉంది. అలాగే వేరేవాళ్ల బాధని హేళనగా చూసి జోకులు వేయడం కూడా తప్పే. అయితే, అది ఏ టైమ్ లో ఎలా చేశాడు.. ఎందుకు చేశాడు అనేది కూడా ఇక్కడ ప్రశ్న. ఆ వీడియోలు బిగ్ బాస్ టీమ్ రిలీజ్ చేస్తే కానీ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది తెలియదు.