ఎట్టకేలకు పవన్ కల్యాణ్ తిరిగి సెట్స్ లోకి అడుగు పెట్టాడు. ఆదివారం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. హైదరాబాద్లో కోర్టు నేపథ్యంలో వచ్చే సన్నివేశాల చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారని తెలుస్తోంది. కోర్టులో కూడా పవన్ కల్యాణ్ డైలాగ్ పార్ట్ షూటింగ్ గతంలో చాలావరకు జరిగింది. ఇప్పుడు కేవలం ఆయన ఎక్స్ ప్రెషన్స్, కోర్టులో నడిచే సన్నివేశాలు, ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారట. గుబురు గడ్డం తీసేసి పవన్ ఈ షూట్ లో పాల్గొన్నారని సమాచారం.