పవన్ కల్యాణ్ చేయబోతున్న అయ్యప్పన్ కోషియమ్ రీమ్ కి త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేయబోతున్నారు. అంటే ఆ సినిమాకోసం త్రివిక్రమ్ పరోక్షంగా పనిచేస్తారు. తాజాగా హీరో రామ్ సినిమాకి త్రివిక్రమ్ కథ రాస్తున్నారని తెలుస్తోంది. రూ.10కోట్ల రూపాయల హాట్ డీల్ తో త్రివిక్రమ్ ఈ కథ రాస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం కథ ఇచ్చి సరిపెట్టకుండా దర్శకత్వం పర్యవేక్షణ కూడా చేసి పెడతానని మాటిచ్చారట. దీంతో రామ్ కొత్త దర్శకుడిని వెదికే పనిలో పడ్డారు. తమ సొంత బ్యానర్లోనే ఈ సినిమా తీయబోతున్నారట రామ్.