ఇస్మార్ట్ హీరో రామ్ తో కూడా త్రివిక్రమ్ పని చేయనున్నారని గత కొంతకాలంగా కథనాలొస్తున్నాయి.రామ్ రిక్వెస్ట్ మేరకు త్రివిక్రమ్ ఓ కథ రాస్తున్నాడట. ఈ కథ కోసం త్రివిక్రమ్ కి 10 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఉంటుందా లేదా అన్నది డౌట్ కానీ కథ స్క్రీన్ ప్లే మాత్రం త్రివిక్రమ్ ఇస్తున్నారని సమాచారం. అయితే ఇది పక్కనపెడితే ఈ ప్రాజెక్ట్ ని 45 కోట్లతో తెరకెక్కించాలని రామ్ ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. అయితే రామ్ పై ఇంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది తెలియదు కానీ.. జులాయ్ టైప్ లో ఓ కథ కావాలని రామ్ త్రివిక్రమ్ ని కోరినట్లుగా సమాచారం.