శ్రీకాంత్  హీరోగా చేస్తున్న రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవితో 'శంకర్‌దాదా ఎంబీబీఎస్', 'శంకర్‌దాదా జిందాబాద్' సినిమాల్లో ఏటీఎమ్‌గా కీలక పాత్ర చేశాడు. కోరి మరీ ఆ సినిమాల్లో ఆ క్యారెక్టర్ చేశాడు . ఆ తర్వాత చిరంజీవి కుమారుడు రామ్చరణ్తోనూ ఓ సినిమా చేశాడు.. అది.. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన 'గోవిందుడు అందరి వాడేలే'. ఆ మూవీలో చరణ్‌కు బాబాయ్‌గా బంగారి అనే క్యారెక్టర్ చేశాడు.ఒక విషయంలో తండ్రీకొడుకులిద్దరూ సేమ్ టు సేమ్ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు శ్రీకాంత్. "చిరంజీవి ఎంత బాగా టైమింగ్ మెయిన్టైన్ చేస్తారో నాకు బాగా తెలుసు. పొద్దున్నే ఏడు గంటలకంటే ఏడు గంటలకు ఆయన సెట్స్ మీదుంటారు. ఇప్పటి జనరేషన్లో చాలామంది మెల్లిగా వెళ్దాంలే అనుకుంటూ ఉంటారు. కానీ రామ్‌చరణ్ కూడా అచ్చం చిరంజీవిగారి లాగే ఏడు గంటలకు సీన్ తీయాలంటేఏ ఆ టైమ్‌కు సెట్లో ఉంటాడు. ఆ అంకితభావం అతనిలో ఉంది. అలాగే సబ్జెక్ట్ మీద ఎంతో ఇన్వాల్వ్మెంట్ చూపిస్తాడు. ఆ విషయంలో ఇద్దరూ ఒకే రకంగా అనిపించారు" అని చెప్పాడు శ్రీకాంత్.