ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' సినిమాలో లో నటిస్తున్నాడు..ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సినిమాలో మన డార్లింగ్ తల్లిగా బాలీవుడ్ సీనియర్ నటి భాగ్య శ్రీ కనిపించనున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  రాధే శ్యామ్‌లోని చాలా మంది భాగ్య శ్రీ నటించిన మైనే ప్యార్ కియా సినిమాకు అభిమానులట. తనపై ఒకానొక సమయంలో క్రష్ ఉండేదని ప్రభాస్ నాకు చెప్పాడంటూ భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నా కోసం హైదరాబాదీ స్వీట్లను గిఫ్ట్‌గా ఇచ్చారు.నేను తినేందుకు 15 రకాల వంటలను టేబుల్‌పై పెట్టేవారు అని భాగ్యశ్రీ తెలిపారు.