వకీల్ సాబ్ కి సంబంధించి పవన్ కల్యాణ్ రెండు గెటప్స్ లో కనిపిస్తారు. ఒకటి లాయర్ గా, ఇంకొకటి మధ్యవయసు వ్యక్తిగా. ఇప్పటి వరకు అధికారికంగా పవన్, లాయర్ గెటప్ విడుదలైంది. రెండో గెటప్ లో కూడా రెండు వేరియేషన్లు ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ రెండు గెటప్స్ ని సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్నారు నిర్మాత దిల్ రాజు. అయితే ఈ రెండు గెటప్స్ ఇప్పుడు అనధికారికంగా బైటకొస్తున్నాయనే సమస్య నిర్మాత దిల్ రాజుని వేధిస్తోంది.