'రంగ్ దే' సినిమాని దాదాపు పూర్తి చేసిన నితిన్ ప్రస్తుతం 'చెక్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. ఇప్పుడు ఈ సినిమాలో మూడో కథనాయికగా మేఘా ఆకాష్ కి అవకాశం దక్కింది. కేవలం నితిన్ రికమండేషన్ వల్లే ఈ సినిమా ఛాన్స్ వచ్చిందని చెబుతున్నారు. ఈ మధ్యనే తిరిగి ప్రారంభమైన 'చెక్' షూటింగ్ లో మేఘా ఆకాష్ త్వరలోనే జాయిన్ అవ్వబోతుందని తెలిసింది.