పెళ్లి పట్ల తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది అనుష్క. వివాహవ్యవస్థపై తనకు నమ్మకముందని పిల్లలంటే కూడా తనకు చాలా ఇష్టమని చెప్పింది. అయితే పెళ్లిపై తొందరపాటు ఏమీ లేదని, కొంత టైం తీసుకుంటానని చెప్పింది. అంతేకాదు తన అభిరుచులకు తగిన వ్యక్తి దొరికితే పెళ్లికి రెడీ అని క్లారిటీ ఇచ్చింది.తల్లిదండ్రుల నుంచి పెళ్లి ఒత్తిడిపై స్పందిస్తూ..నేను 20 ఏండ్ల వయస్సున్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు.అయితే ఇపుడు నా తల్లిదండ్రులు పెళ్లి విషయంలో ఏ ఇబ్బంది పెట్టడం లేదు.  నా ఫిల్మ్ కెరీర్ ను కొనసాగిస్తానని చెప్పుకొచ్చింది. తనకిప్పుడే రిటైర్ మెంట్ ప్లాన్స్ ఏమీ లేవని స్వీటీ ఇప్పటికే మీడియాతో వెల్లడించింది.