మహానటి రిలీజ్ తర్వాత వర్కవుట్ చేయడం మొదలు పెట్టిన కీర్తి సురేష్.. తాను మరీ అంత స్లిమ్‌గా మారడానికి కారణం మిస్ ఇండియా మూవీయేనని చెప్పింది. సినిమాలో సన్నగా ఉండాలి, ఏ డ్రెస్ వేసినా బావుండాలని డైరెక్టర్ చెప్పడంతో బరువు తగ్గానని క్లారిటీ ఇచ్చింది. దర్శకుడి ఒత్తిడి లేకపోతే అంత తక్కువ సమయంలో తాను అనుకున్నంత బరువు తగ్గేదాన్ని కాదని చెప్పింది. సినిమా బాగా రావాలనే తపనతో దర్శకుడు తన బరువు విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నారని, ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టే తాను ఈ టాస్క్ ని ఛాలెంజ్ గా తీసుకున్నాని చెప్పింది కీర్తి.