మెగా హీరో సాయి తేజ్ కొత్తగా మొదలుపెట్టిన చిత్రంలో ముందుగా నివేత పేతురాజ్ నే హీరోయిన్ అనుకున్నారు.కానీ ఏమైందో ఏమో కానీ షూటింగ్ మొదలయ్యే నాటికి అన్నే మారిపోయి ఆమె స్థానంలోకి మరొక నటి ఐశ్వర్య రాజేష్ వచ్చి చేరింది. దీంతో అందరిలోనూ ఏం జరిగి ఉంటుంది అనే ఉత్కంఠ.  ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ మేరకు మొదటగా దర్శకుడు దేవ కట్ట తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ అయితే బాగుంటుందని అనుకున్నారట. ఎందుకంటే ఐశ్వర్య రాజేష్ మంచి నటి. పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. దేవ కట్ట కూడ గ్లామర్ కంటే నటనకే ఎక్కువ అవకాశం ఇస్తుంటారు. అందుకే ఆయన ఐశ్వర్యను తీసుకుందాం అనుకున్నారు.కానీ ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్లు కుదర్లేదు. దీంతో చేసేది లేక నివేత పేతురాజ్ పేరును కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ షూటింగ్ మొదలయ్యే నాటికి ఐశ్వర్య డేట్స్ ఫ్రీ అయ్యాయని కబురందిందట. దీంతో నివేత పేరును తీసేసి ఐశ్వర్యను తీసుకున్నారట.