ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా..అందులో మలయాళ నటి ప్రగ్యా మార్టిన్ ఒక కథానాయిక పాత్ర కోసం ఫైనల్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్.ఇక తాజాగా సమాచారం ప్రకారం.. మరో మలయాళీ హీరోయిన్ పూర్ణను సెంకెడ్ హీరోయిన్గా ఎంచుకున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈమె తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న ఢీ ఛాంపియన్స్ అనే డాన్స్ షో కి జడ్జి గా వ్యవహరిస్తోంది. తెలుగులో ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో నటించి.. మంచి గుర్తింపును దక్కించుకునన్నా కానీ ఈ మధ్య ఈమెకు అంతగా అవకాశాలు రావట్లేదు.  అయితే ఇప్పుడు పూర్ణ ని బాలయ్య కు జోడిగా ఎంచుకోవడం నిజంగా షాకింగ్ విషయమే అని చెప్పాలి.