ఎన్టీఆర్ కొమురం భీం ఇంట్రో టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే.  కొమరం భీమ్ అభిమానులతో పాటు హిందు సంఘాలు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణా బీజేపీ నాయకులు రాజమౌళిని బహిరంగంగా హెచ్చరించడం జరిగింది.హిందువైన కొమరం భీమ్ ని ముస్లిమ్ గా ఎలా చూపిస్తావ్ అని వారు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.నిజానికి ఇది శాంపిల్ మాత్రమే అనుకోవాలి. ఇంతకు మించిన వ్యతిరేకత, ఇబ్బందులు రాజమౌళి భవిష్యత్ లో ఎదుర్కొనే అవకాశం కలదు. చరిత్రక పాత్రలైన అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ లను స్ఫూర్తిగా తీసుకున్న రాజమౌళి ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్నారు. ఉద్యమ వీరులుగా ఉన్న ఇద్దరు యోధుల జీవితగాథను రాజమౌళి తనకు ఊహకు తగ్గట్టుగా మలచి తెరకెక్కించడం మరిన్ని వివాదాలు రాజేయడం ఖాయం. చిన్న టీజర్ తోనే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజమౌళి, ట్రైలర్స్ మరియు సినిమా విడుదల తరువాత మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా కొమురం భీం కుటుంబీకులు మరియు ఆదివాసీలు ఈ సినిమాను పూర్తిగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయిమరి.