చరణ్ కు అరడజను మంది డైరెక్టర్లు కలిసి కథలు వినిపించారు. అనిల్ రావిపూడి, గౌతమ్ తిన్ననూరి, సందీప్ రెడ్డి, పూరి జగన్నాథ్, వెంకీ కుడుముల, సురేంద్ర రెడ్డి వంటి అగ్ర దర్శకులు వినిపించిన కథలు విన్నాడు. కాబట్టి ఏ డైరెక్టర్ కు ఓకే చెబుతాడు అనేది కచ్చితంగా చెప్పలేము. ఈ మధ్యనే ఈ దర్శకులు మళ్ళీ చరణ్ ను సంప్రదిస్తే.. :ఒక 6నెలల వరకూ టైం కావాలని.. ‘ఆర్.ఆర్.ఆర్’ ‘ఆచార్య’ పూర్తయ్యేంత వరకూ ఏ నిర్ణయమూ తీసుకోలేనని’ చెప్పాడట. దాంతో ఈ దర్శకులు ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూసుకోవడానికి రెడీ అయినట్టు సమాచారం.