ప్రభాస్, అనుష్క జంటకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలసి స్క్రీన్ పై కనపడితే ఆ సందడే వేరు. బాహుబలి తర్వాత వీరిద్దరి జర్నీకి కాస్త విరామం వచ్చిందని అనుకుంటున్న అభిమానులకు రాధేశ్యామ్ చిత్ర బృందం ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పబోతోంది. ఈ సినిమాలో అనుష్కకి కూడా ఓ మంచి రోల్ ఉందని తెలుస్తోంది.