ఇటీవల మలయాళంలో హిట్ అయిన 'అయ్యప్పనున్ కోషియం'సినిమాని తెలుగులో రిమేక్ చేస్తున్నారు.ఈ రిమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అయ్యప్పనమ్ కోషియం రీమేక్‌లో పవన్ కళ్యాణ్ భార్య పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ ను పరిశీలిస్తున్నారు. ఇది ఒక మాజీ నక్సలైట్ పాత్ర కాబట్టి ఐశ్వర్య వంటి మంచి నటి అవసరం. కానీ ఒరిజినల్లో పాత్రకు చాలా తక్కువ నిడివి ఉంటుంది.మరోవైపు, అయ్యప్పనమ్ కోషియం రీమేక్ యొక్క మేకర్స్ ఈ సినిమాలో రెండవ లీడ్‌ను ఇంకా ధృవీకరించలేదు.సినిమాలో రెండవ పాత్రలో రానా, రవితేజ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ దానిపై క్లారిటీ రాలేదు. ఈ సినిమాని సాగర్. కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.