పవన్ కల్యాణ్ ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్ కి తిరిగి హాజరవుతున్నారు. ఈపాటికే కోర్టు సీన్లు కూడా పూర్తయ్యాయి. ఇక పవన్ కల్యాణ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నేరేషన్ మాత్రం మిగిలి ఉందని అంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ లేటెస్ట్ లుక్ ప్రకారం ఆయనపై మాంచి లవ్ ట్రాక్ చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. చాతుర్మాస దీక్ష తర్వాత పవన్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. అప్పటి వరకూ తెల్లటి నూలు దుస్తులు ధరించిన పవన్ సరికొత్తగా మోడ్రన్ లుక్ లో కనిపిస్తున్నారు.