ఒకప్పుడు తన సినిమాలతో బాలీవుడ్ ని కూడా షేక్ చేసిన దర్శకుడు శంకర్. జెంటిల్మెన్, భారతీయుడు, గజిని, అపరిచితుడు, రోబో.. ఇలా వరుస సినిమాలతో తన స్టామినా చాటి చెప్పారు. అయితే అలాంటి శంకర్ ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నాడు. రోబో-2, ఐ లాంటి సినిమాలు భారీగా శంకర్ అభిమానుల్ని నిరాశపరిచాయి. దీంతో ఆటోమేటిక్ గా శంకర్ అంటేనే నిర్మాతలకు చిన్నచూపు ఏర్పడింది. భారీ చిత్రాల దర్శకుడిగా ఒకప్పుడు శంకర్ తో సినిమాలు తీయాలనుకునే నిర్మాతలంతా ఇప్పుడు ఆయన పేరు చెబితేనే భయపడిపోతున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టి, లాభాలకోసం వేచి చూసే రోజులు పోయాయి.